ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు

పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

హుజురాబాద్ ఎన్నిక‌లు ప్ర‌పంచ‌లోనే అత్యంత ఖ‌రీదైన‌విగా మిగిలిపోతాయ‌ని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆయ‌న మాట్లాడుతూ ఎన్నిక‌ల కోసం ఒక పార్టీ 400 కోట్లు..మరో మర్టీ 100 కోట్లు ఖర్చు పెడుతోంద‌న్నారు. అక్రమంగా సంపాదించిన దొంగ సొమ్మును బయట పెడుతున్నారని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు ప్రజా సమస్యలు మీద జరిగేవి కాదన్నారు. ప్రజా సమస్యలు అసలు చ‌ర్చే లేద‌ని అన్నారు. నిరోష అనే నిరుద్యోగ యువతి ఉద్యోగాల పై నిలదీస్తే కొడతారా..? అని ప్ర‌శ్నించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ 4 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని దాని గురించి క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. హుజూరాబాద్ లో 36 వేల మంది నిరుద్యోగులు…30 వేల మంది విద్యార్థులు ఉన్నారని, నిరుద్యోగులు ప్రశ్నించడం మొదలు పెడితే టీఆర్‌ఎస్ ప్రచారం సాగదని భయం పట్టుకుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యార్థి, నిరుద్యోగ ప్రతినిధిగా వెంకట్ ని బ‌రిలోకి దింపామ‌ని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని దుయ్య‌బ‌ట్టారు. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నికలను గోల్ మాల్ చేయడానికి మామ అల్లుళ్ళు రంగంలోకి దిగారని అన్నారు. దళిత బంధు విషయంలో టీఆర్‌ఎస్ బీజేపీలు తోడు దొంగలే అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దళిత బంధు పథకాన్ని ఎన్నికలకు ముందే అమలు చేశారని, పోయిన బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించారని అన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి దగ్గరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెళ్ళలేదని ప్ర‌శ్నించారు. పాత పథకం అయితే ఆపితే ఎలా ఊరుకున్నార‌ని ప్ర‌శ్నించారు. కేంద్ర ఎన్నికల అధికారిని కలవకపోవడం అనుమానాలకు తావిస్తోంద‌న్నారు. రాష్ట్రం లో ఉన్న 20 లక్షల దళిత కుటుంబాలకు…. 10 లక్షల గిరిజన కుటుంబాలకు దళిత బందు ఇవ్వాలని ఆయ‌న ఈ సంద‌ర్భంగా కోరారు. కేసీఆర్ కి దళిత ద్రోహి అనే బిరుదు ఇస్తున్నామ‌న్నార‌న్నారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like