బ్రేకింగ్.. 28 నుంచి రైతుబంధు..

రైతుబంధు పథకానికి సంబంధించి నిధులను 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి రైతుబంధు సాయంతో పాటు లబ్దిదారుల సంఖ్య కూడా పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వానాకాలం సీజన్లో 61 లక్షల మందికి.. 7 వేల 377 కోట్లు సాయంగా అందించారు. యాసంగిలో లబ్దిదారుల సంఖ్య అరవై ఆరున్నర లక్షలకు చేరుకోగా 7వేల 600 కోట్లను ఖర్చు చేయనున్నారు.