అక్రిడియేష‌న్ కార్డుల సంఖ్య పెంచండి

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు వినతి

చిన్న ప‌త్రిక‌ల‌కు సంబంధించి అక్రిడియేష‌న్ కార్డుల సంఖ్య పెంచాల‌ని తెలంగాణ చిన్న మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం కోరింది. ఈ మేర‌కు ఆ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మాతంగా దాస్ ఆధ్వ‌ర్యంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు విన‌తిప‌త్రం అందించారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ అక్రిడియేష‌న్ కార్డుల జారీలో ఏ,బి కేటగిరిలను పోలిస్తే సి,డిలకు కేటాయిస్తున్న కార్డుల్లో భారీ వ్యత్యాసం ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అక్రిడియేష‌న్ కార్డుల మంజూరుకు ప్రతిబంధకంగా ఉన్న 239 జీవో స‌వ‌రించాల‌ని కోరారు. ఈ కేటగిరిల నడుమ ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి తగు న్యాయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like