టీచర్లు.. మీ ఆస్తుల లెక్క చెప్పండి
-ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే
-ఆస్తులు అమ్మాలన్నా, కొన్నాలన్నా అనుమతి తీసుకోవాలి
-ప్రతి ఏటా ఆస్తి వివరాలు సబ్మిట్ చేయాలి
-కీలక జీవో జారీ చేసిన విద్యాశాఖ

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు వెల్లడించాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా వివరాలు చెప్పాలని, అలాగే ఏడాదికోసారి ఆస్తుల వివరాలు సమర్పించాలని టీఎస్ విద్యాశాఖ స్పష్టం చేసింది. ముందుగా అనుమతి తీసుకున్న తర్వాతే..స్థిర,చర ఆస్తులు కొనుగోలు, అమ్మకాలు చేయాలని ఉద్యోగులను ఆదేశించింది. టీచర్లు, ఉద్యోగులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని ఆర్జేడీలు, డీఈవోలకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్సు శాఖ రిపోర్ట్ ఇవ్వడంతో విద్యాశాఖ నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
మరోవైపు ఇలాంటి నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకరిద్దరు చేసిన పనికి టీచర్లందరినీ ఆస్తుల వివరాలు కోరడమేంటని ప్రశ్నిస్తున్నాయి. అయితే, విద్యా శాఖలో ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇన్నేళ్లు ఉపాధ్యాయుల విషయంలో అంతగా పట్టించుకోని విద్యాశాఖ… ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.