తప్పిన ముప్పు: యోగి హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ప్రయాణీస్తున్న హెలికాప్టర్ ఆదివారం వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. యోగీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొనడంతో పైలెట్ వెంటనే హెలికాప్టర్ అత్యవసరంగా లాండ్ చేశారు. శనివారం వారణాసిలో పర్యటించిన ముఖ్యమంత్రి అభివృద్ది పనులు, శాంతిభద్రతలను సమీక్షించారు. ఆదివారం ఉదయం వారణాసిలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ లక్నోకు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్ కు సాంకేతిక పరీక్ష నిర్వహిస్తున్నారు. అధికారులు లక్నో నుండి వారణాసికి విమానాన్ని రప్పించారు. ఆ విమానంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ బయలుదేరారు.