జనక్‌ప్రసాద్‌ను గెలిపించుకుందాం..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి కార్మిక నేత జనక్ ప్రసాద్ ని కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించుకోవాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరిఖని INTUC ఆఫీస్ లో భేటీ అయి మాట్లాడారు. రామగుండం లో 30 ఏళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరన్నారు. రామగుండం కార్మిక క్షేత్రం అని ఇక్కడ దాదాపు 15,000 సింగరేణి కార్మిక కుటుంబాలు అదేవిధంగా 15,000 మంది సంగటిత అసంఘటిత కార్మిక కుటుంబాలు ఉన్నాయని వెల్లడించారు. దాదాపు 40 ఏళ్లుగా కార్మిక రంగంలో కార్మికులకు సేవలు అందిస్తూ, కార్మిక విధానాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి గా జనక్‌ప్రసాద్ సరైన వ్యక్తి అని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనేక దేశాలలో కార్మికుల సమస్యల పై మాట్లాడిన మేధావిగా, అవినీతి ఆరోపణలు లేని ఒక వ్యక్తి గా జనక్ ప్రసాద్ ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా వీటిని పరిగణనలోకి తీసుకొని కార్మికుల కోసం పోరాడే సత్తా ఉన్న జనక్ ప్రసాద్ కి టికెట్ ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి,RG-1వైస్ప్రెసిడెంట్ పెంఛాల తిరుపతి,సీనియర్ జాయింట్ సెక్రెటరీ లక్ష్మీపతి గౌడ్,దేవులపల్లి రాజేందర్,టైసన్ శ్రీనివాస్,గుడేటి శ్రీనివాస్,వికాస్ కుమార్ యాదవ్,పోలు మహేష్ బాబు,సాగర్,అల్లావుద్దీన్ పాల్గొన్నారు.