మ‌ళ్లీ గోడ దూకిన బోడ‌..

-రికార్డుస్థాయిలో పార్టీలు మారిన నేత‌గా గుర్తింపు
-ఈసారి కాంగ్రెస్‌లోకి జంప్

మంచిర్యాల :బోడ‌ జ‌నార్థ‌న్ మ‌ళ్లీ పార్టీ మారారు. త‌ర‌చూ పార్టీలు మారే నేత‌గా గుర్తింపు పొందిన ఆయ‌న తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలు మార్చ‌డంలో ఒక ర‌కంగా రికార్డు సాధించారు కూడా.. చెన్నూర్ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలు శాసన సభ్యుడిగా, చంద్రబాబు హయంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన జనార్ధన్ తూర్పు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. ఆయ‌న 1985లో టిడిపి శాసన సభ్యుడిగా మొదటి సారి గెలుపొందారు. 1988లో ఆర్టీసి కార్పోరేషన్ చైర్మన్‌గా, 1989, 1994లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.చంద్రబాబు మంత్రివర్గంలో కార్మిక మంత్రిత్వశాఖను నిర్వర్తించారు. 2003లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా పనిచేసిన బోడ జనార్ధన్ తిరిగి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగానే వ్యవహరించి రాష్ట్ర నేతగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత రాజకీయాల్లో నెలకొన్న మార్పుల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అనంత‌రం బీజేపీలో ప‌నిచేసి త‌ర్వాత తిరిగి సొంతగూటికి చేరుకొని టిడిపి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇవ్వక‌పోవ‌డంతో బ‌హుజ‌న్ లెఫ్ట్ ఫ్రంట్ (సీపీఎంకూట‌మి) నుంచి పోటీ చేశారు. తిరిగి బీజేపీలో చేరారు. బీజేపీలో ఆయ‌న‌కు త‌గిన ప్రాధాన్య‌త దొర‌క‌లేదు. ఏడాది నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎట్ట‌కేల‌కు ఫ‌లించి చివ‌ర‌కు ఆదివారం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు..

అయితే, ఆయ‌న అనుచ‌రులు అంతా కాంగ్రెస్‌లోనైనా ఉంటారా..? మ‌ళ్లీ ఏడాది రెండేళ్ల‌లో పార్టీ మారుతారా..? అనే విష‌యంలో చ‌ర్చించుకుంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like