బెల్లంపల్లి పోలీస్ ఆధ్వర్యంలో 1050 యూనిట్ల రక్తం
వారికి సహకరించడం ఒక సామాజిక బాధ్యతగా భావించాలి : ఏసీపీ ఏడ్ల మహేష్
అమరవీరుల సంస్మరణ దినం(ఫ్లాగ్ డే) అక్టోబర్ 21 సందర్బంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలాన్ని పెంచేందుకు అవసరమైన రక్తాన్ని సేకరించేందుకుగాను రామగుండం పోలీస్ కమిషనరేట్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల అధ్వర్యంలో బెల్లంపల్లి లో పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేయగా ముఖ్య అతిధి గ గౌ .బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య గారు హాజరైయ్యారు . మందమర్రి లో మంజునాథ ఫంక్షన్ హాల్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. *బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు,సిబ్బంది,యువత, ప్రజలు, స్వచ్చంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు ఇతరులు పోలీస్ పిలుపు మేరకు బెల్లంపల్లి -660 యూనిట్ల రక్తం, మందమర్రి లో -385 మొత్తం 1045 యూనిట్ల రక్తం దానం చేయడం జరిగింది .ఈ రక్త దాన శిబిరంలో 45
మంది పోలీస్ సిబ్బంది రక్త దానం చేయడం జరిగింది .ఒక్క రోజు ఇంత పెద్ద మొత్తం లో రక్త దానం చేయడం రాష్టంలో ప్రధమం అని ఇది ఎంతో గర్వించ తగ్గ ప్రోగ్రాము అని ముఖ్య అతిధులు ప్రజలు పోలీసులని అభినందించారు
ఈ సందర్భంగా ఏసీపీ గారు మాట్లాడుతూ సమాజం లో శాంతి భద్రతలను రక్షించే పోలీసులు తమ విధి నిర్వహణలో ఎంతో మంది ప్రాణాలను విడిచారు వారి త్యాగాలను ఎప్పుడు మరిచిపోకుండా వారిని స్మరిస్తూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది కావున పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివి అని కొనియాడారు. రక్త దాన శిబిరం లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
రక్తదానం పట్ల వున్న అపోహలను నమ్మకుండా రక్తదానం చేసేందుకుగా స్వచ్ఛందంగా ముందుకురావాలని, ముఖ్యంగా తలసేమియా వ్యాధితో జీవితపోరాటం చేస్తున్నవారికి మనమందరం సహాకరంగా నిలవాలని, వారికి అవసరమయిన రక్తాన్ని అందించేందుకు యువతను ప్రోత్సహించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ రక్తదాన శిభిరం లో మందమర్రి సర్కిల్ ఇన్సెపెక్టర్ ప్రమోద్ రావు ,బెల్లంపల్లి రురల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ జగదీష్ ,బెల్లంపల్లి 1 టౌన్ ఎస్ ఎచ్ ఓ రాజు ,తాండుర్ సర్కిల్ ఇన్సెపెక్టర్ బాబురావు మరియు బెల్లంపల్లి సబ్ డివిజన్ ఎస్ ఐ లు ,పి ఎస్ ఐ లు మరియు సిబ్బంది హాజరైయ్యారు .