యువత భవితవ్యం నిర్వీర్యం
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ వల్ల యువత భవితవ్యం నిర్వీర్యం అవుతుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబి చౌరస్తాలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్నిపథ్ వల్ల భారత ఆర్మీ వ్యవస్థ బలహీన పడుతుందన్నారు. అగ్నిపథ్ పథకం అనేది సైనికులను అవమాన పరిచేలా ఉన్నదని మండిపడ్డారు.16 ఏళ్ళు పనిచేసే ఆర్మీలో నాలుగేళ్ల విధానం సరికాదన్నారు. వెంటనే అగ్నిపథ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.