ముఖ్య నేతలతో వరుస సమావేశాలు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజీ బిజీ... ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్ – పార్టీ ప్లీనరీ , నవంబర్ 15 న విజయగర్జన సభ జయప్రదం చేయడం తో పాటు , నియోజకవర్గ పార్టీలో అంతర్గత సమస్యల ను పార్టీ నేతలతో మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజు కు 20 నియోజకవర్గాల చొప్పున పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే 40 నియోజకవర్గ పార్టీ నేతల తో భేటీ అయిన కేటీఆర్. వరుసగా మూడో రోజు తెలంగాణ భవన్ లో నియోజకవర్గ పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం.
మహేశ్వరం , శేరిలింగంపల్లి ,కూకట్పల్లి ,కుత్బుల్లాపూర్ , మేడ్చల్ ,ఉప్పల్ , మల్కాజిగిరి , ఇబ్రహీంపట్నం ,ఎల్బీనగర్ , రాజేంద్రనగర్ నియోజకవర్గ నేతలతో మాట్లాడారు. ఇక మధ్యాహ్నం ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా కు చెందిన ఖమ్మం , కొత్తగూడెం ,అశ్వరావు పేట ,భద్రాచలం ,పినపాక , ఇల్లందు , వైరా,ఆలేరు, మధిర నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు చెప్పిన విషయాలు ఆయన సావధానంగా విన్నారు.