బీజేపీ కార్యాలయం వద్ద రణరంగం
పోటాపోటీ నినాదాలు.. పరస్పర దాడులతో హన్మకొండ బీజేపీ కార్యాలయం దద్దరిల్లిపోయింది. హన్మకొండ బిజెపి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. ఆ విషయం తెలిసి బీజేపీ కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. వాహనాలను ధ్వంసమయ్యాయి. కొన్ని గంటల పాటు ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు.
పోలీసులు ఆందోళనకారులను అదుపు చేస్తున్న క్రమంలో సుబేదారి సీఐ అనిల్ తలకు బలమైన గాయమయ్యింది. దీంత పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంలో పోలీసులు కావాలనే నిర్లక్ష్యం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తారని ముందుగానే సమాచారం ఉన్నా.. పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.