వర్షానికి ఇల్లు కూలి ఒకరి మృతి
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇల్లు కూలడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాంలో విషాదం నెలకొంది. శుక్రవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఈ వర్షానికి గట్టు బీమాగౌడ్‌కు చెందిన ఇల్లు పూర్తిగా కూలింది. ఈ ఘటనలో భీమాగౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శారద, కొడుకు చంద్రశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.