కానిస్టేబుల్ వసీం అక్రమ్ సస్పెన్షన్

రామగుండం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎంఏ. వసీం అక్రమ్‌ను సస్పెండ్ చేస్తూ రామగుండం కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వసీం అక్రమ్ కానిస్టేబుల్ (3500) తప్పుడు సమాచారం ఇచ్చి దీర్ఘకాలిక సెలవులో ఉన్నాడు.
కానిస్టేబుల్ ఎంఏ.వసీంఅక్రమ్ స్టార్ ఫౌండేషన్ కోచింగ్ సెంటర్, కరీంనగర్లో డిఫెన్స్/పోలీస్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్ కొంతకాలం నుంచి నిర్వస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇతర ప్రైవేటు, వ్యాపార కార్యకలాపాలలో పాల్గొన్నందుకు ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా ఉద్యోగం నిర్వహిస్తూ ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని కమిషనర్ ఎస్.చంద్ర శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా, ఇదే కారణంపై శుక్రవారం కరీంనగర్‌కు చెందిన రాజు అనే కానిస్టేబుల్‌ను సైతం సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ రాజు దీర్ఘకాలికల సెలవులో ఉండి డిఫెన్స్/పోలీస్ కోచింగ్ సెంటర్లలో నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నాడని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లలో కానిస్టేబుల్ రాజుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.