డైనమిక్ సిటీ హైదరాబాద్ చేరుకున్నా
-తెలుగులో ట్వీట్ చేసిన మోదీ
-ధన్యవాదాలు చెబుతూ రీట్వీట్ చేసిన మంత్రిీ
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేట విమనాశ్రయంలో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నేరుగా హెచ్ఐసీసీకి చేరుకున్నారు. హెచ్ఐసీసీ నుంచి హోటల్ నోవాటెల్‌లో విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న మోదీ.
మోదీ హైదరాబాద్ చేరుకున్న వెంటనే తెలుగులో ట్వీట్ చేశారు. డైనమిక్ సిటీ హైదరాబాద్ చేరుకున్నానని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నవేళ తాను హైదరాబాద్ వచ్చినట్టు పేర్కొన్నారు. పార్టీ బలోపేతంపై చర్చిస్తామని ట్విటర్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ట్వీట్‌కు మంత్రి తలసాని వెంటనే స్పందించారు. హైదరాబాద్‌ను డైనమిక్ సిటీగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆయన రీట్వీట్ చేశారు.