మిస్ ఇండియా శినిశెట్టి
ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని కర్ణాటకకు చెందిన శినిశెట్టిని గెలుచుకున్నారు. పోటీల్లో తెలంగాణకు చెందిన ప్రగ్యా అయ్యగారి నాలుగో స్థానంలో నిలిచింది. శినిశెట్టి వయస్సు 21 సంవత్సరాలు కాగా, ఆమె స్వస్థలం కర్ణాటక. మిస్ ఇండియా2022 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ జూలై 3న ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. వేడుకలో రాజస్థాన్ కు చెందిన రూబల్ షెకావత్, ఫస్ట్ రన్నర్ అప్ గా, ఉత్తరప్రదేశ్ కు చెందిన షినతా చౌహాన్ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. మిస్ ఇండియా 2021 విజేత మానస వారణాసి శిని శెట్టికి కిరీటం అలంకరించారు. సినీ శెట్టి స్వరాష్ట్రం కర్ణాటక అయినా ముంబైలోనే పుట్టి పెరిగింది. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ లో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా చేస్తున్నారు. సినీశెట్టి భరతనాట్య కళాకారిణి కూడా కావడం విశేషం. ఆమెకు డాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది.నాలుగేళ్ల వయసు నుంచి భరత నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టినట్లు తెలిపింది.