ఎస్సై,కానిస్టేబుల్ పరీక్షల తేదీలివే
హైదరాబాద్: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆగస్టు 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఎస్సై రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.