బీజేపీ జెండా గద్దె కూల్చివేత:ఆందోళన

బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని మండలం బిట్టుర్పల్లిలో భారతీయ జనతాపార్టీ జండా గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. దీంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీస్ కేస్ పెట్టాలని రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పులబోయిన భీమన్న,ఉపాధ్యక్షులు తిరుపతి, ప్రధాన కార్యదర్శి దశరథం,జిల్లా కార్యదర్శి గోవర్ధన్,బెల్లంపల్లి బీజేపీ కౌన్సిలర్ అనిత రాజులాల్ యాదవ్,నాయకులు అజ్మీరా శ్రీనివాస్,శనిగారపుశ్రావణ్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.