పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి
ఆత్మహత్యాయత్నం బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

మంచిర్యాల : పేదల కోసం కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు వారికి కేటాయించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తమకు ఇండ్లు ఇవ్వకుండా వేధింపులకు గురి చేసిందుకు ఆత్మహత్యాయత్నం చేసిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఇండ్లు పూర్తయినా వారికి అప్పగించకుండ జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఇండ్లు లేక వర్షాలకు తట్టుకోలేక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి వెళ్ళారనీ, కానీ పోలిస్ ల తో బలవంతంగా వారి ఇండ్లను ఖాళీ చేయిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మజీద్, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్ రామగిరి భానేశ్,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సల్లం మహేష్, కొండ చంద్రశేఖర్, పుదరి ప్రభాకర్,బోయపత్తుల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.