సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు… మోహన్ రావు కాలనీకి చెందిన అశోక్ అనే వ్యక్తి వయసు (29)ఆన్లైన్ సర్వీస్ వృత్తిలో కొనసాగుతున్నాడు, బుధవారం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయం చూసి సెల్ఫీ వీడియో తీస్తూ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన… గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పర్చుకొని వారికి తెలిసే విధంగా సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన…కుటుంబ సభ్యులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. యువకుడి ఆత్మహత్య విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు