బ్రిటన్ ప్రధాని జాన్సన్ రాజీనామా

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ గురువారం ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు పెద్ద ఎత్తున రాజీనామాలు చేశారు. 40 మంది మంత్రులు రాజీనామా చేశారు. తప్పని సరి పరిస్థితుల్లో తన పదవికి జాన్షన్ రాజీనామా చేశారు. ఆయన నాయకత్వంపై నమ్మకం కోల్పోయామంటూ ఆయనకు రాసిన రాజీనామా లేఖల్లో మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని ట్విట్టర్‌లో పెట్టారు. కొంతకాలంగా జాన్సన్ పనితీరు దారుణమంటూ దుయ్యబట్టారు.
జాన్సన్ ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. కరోనా సమయంలో పార్టీ గేట్ వివాదం, ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ క్రిస్ పించర్ వివాదం, బోరిస్ కు తీవ్ర తలవంపులు తెచ్చిపెట్టాయి. దీన్ని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు.
మంత్రులు, ఎంపీల మద్దతు కోల్పోయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్కడి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా సైతం వైదొలగనున్నారు. కొద్దిరోజుల తరువాత కన్జర్వేటివ్ పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు. అనంతరం అక్టోబరులో కొత్త ప్రధానిని ఎన్నుకుంటారు.