పట్టాలు ఇప్పించండి
ఎమ్మెల్యేని కోరిన నాయకులు
మంచిర్యాల:తమ గ్రామంలో నివసిస్తున్న వారికి పట్టాలు అందించాలని మాదారం టౌన్షిప్ నేతలు కోరారు. తమ గ్రామంలో ప్రజలు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నా పట్టాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి విరమణ పొందిన కార్మికులు, కార్మికేతరులు ప్రైవేట్ ఇండ్లల్లో నివాసము వుంటున్నారని అన్నారు. అలాంటి వారికి పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. అదేవిధంగా కంపెని క్వార్టర్లు ఖాళీగా వున్నాయని వాటిని పదవి విరమణ పొందిన కార్మికులకు కేటాయించాలని కోరారు. కొంతమంది పేదవాళ్ళు సైతం ఖాళీ క్వార్టర్లు ఉంటున్నారని వారికి కూడా ఈ ఖాళీ క్వార్టర్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసారు. వినతిపత్రం సమర్పించిన వారిలో TBGKS కేంద్ర చర్చల ప్రతినిధి ధరావత్ మంగిలాల్, మాదారం టౌన్షిప్ సర్పంచ్ ధరావత్ సాగరిక, ఉప సర్పంచ్ షేక్ ఆసియా, టీఆర్ ఎస్ నేత రషీద్ ఉన్నారు.