TDP vs YSRCP: తగ్గేదేలే..ఇప్పటి వరకు ఒక లెక్క. ఇకపై మరో లెక్క.. ఇక ఢిల్లీకి చేరనున్న ఏపీ రచ్చ
టీడీపీ- వైసీపీ పోటాపోటీ దీక్షలు-నిరసనలు. ఇప్పటి వరకు ఒక లెక్క.! ఇకపై మరో లెక్క.! వార్ నెక్ట్స్ లెవల్‌కి చేరింది. సీన్ ఢిల్లీకి మారనుంది. హస్తిన వీధుల్లో తేల్చుకునేందుకు ఆ రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. అటు రాజ్‌భవన్ గడప కూడా తొక్కారు టీడీపీ నేతలు.. ఇక పట్టాభికి నవంబర్2 వరకు రిమాండ్ విధించి కోర్టు..
ఏపీలో ప్రజెంట్ పొలిటికల్ సిట్యుయేషన్ తగ్గేదేలే..అన్నట్లు సాగుతోంది. ఏపీ రచ్చ ఇక ఢిల్లీకి చేరనుంది. రాష్ట్రంలో పోటాపోటీ దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్న టీడీపీ-వైసీపీ ఇప్పుడు హస్తినమే సవాల్ అంటున్నాయి. ఢిల్లీ వేదికగా బలప్రదర్శనకు రెడీ అవుతున్నాయి. దీక్ష ముగిసిన వెంటనే దేశ రాజధానికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు చంద్రబాబు. హోంమంత్రి అమిత్‌షాను కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరించాలని భావిస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా హస్తిన యాత్రకు సై అంటున్నారు.. అమిత్‌షాతోపాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరనున్నారు.