భారీ వర్షాల దృష్ట్యా ప్రజావాణి రద్దు
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. జిల్లాలో పొంగుతున్న వాగులు, నిండి ఉన్న చెరువు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నేడు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితులలో కంట్రోల్ రూమ్ నెంబర్ 08736-250500, 08736-250501, 08736-250502, 08736-250504 లను సంప్రదించాలని తెలిపారు.