చెట్లను తొలగించి.. వాగులు దాటించి..
ఆస్పత్రికి గర్భిణీ తరలింపు
ఆ గ్రామానికి సరైన దారి లేదు.. వాగులు, వంకలు దాటుతూ వెళ్లాల్సిందే… అలాంటిది ఒక గర్భిణీకి అది కూడా విపరీతమైన వర్షాలు పడుతున్న ఈ సమయంలో.. ఎన్నో కష్ట,నష్టాలకు ఓర్చి తరలించాల్సిందే. దహెగాం మండలం మొట్లగూడ గ్రామానికి సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఇదే గ్రామానికి చెందిన కామెర విజయ మొదటికాన్పు పురుడు కోసం పుట్టింటికి వచ్చింది. ఈ నెల 15న ప్రసవం తేదీ ఉంది. వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా అధికారులకు ఆరోగ్యకార్యకర్త సత్యవాణి సమాచారం అందించింది. దీంతో ఆ గర్భిణి కుటుంబసభ్యులను ఒప్పించి మంగళవారం ఆసుపత్రికి తరలించారు. మొట్లగూడ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు.దీంతో పోలీసుల సాయంతో వాగులు దాటించి, రోడ్డుపై పడిన చెట్లను తొలగించి మూడు వాహనాలు మార్చి చివరికి 108లో ఆసుపత్రికి తరలించారు. సీఐ నాగరాజు, ఎస్సై సనత్ కుమా రులు, అటవీశాఖ సిబ్బంది, గ్రామస్థులు వారికి సహకరిండచంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగలిగారు. ఆపద సమయంలో అండగా నిలిచిన పోలీసులు, అటవీ శాఖ సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు.