విద్యాసంస్థలకు సెలవులు పొడగింపు

భారీ వర్షాలతో జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రభావంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా, మరో మూడు రోజుల పాటు సెలవులు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. శనివారం వరకు సెలవులు పొడగించారు. సోమవారం తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ముందు జాగ్రత్తగా సోమ, మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిదే. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. పున ప్రారంభం సోమవారం అంటే 18 జులై 2022 నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభమవుతాయి..