అస‌లు ఏంటీ క్లౌడ్ బ‌ర‌స్ట్..

ముఖ్యమంత్రి వ్యాఖ్య‌ల‌తో మేఘ విస్ఫోట‌నంపై చ‌ర్చ‌

”గోదావరిపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందనే అనుమానం ఉంది.. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి ద్వారా దేశంలో ఆకస్మిక వరదలు స్పష్టిస్తున్నారు. విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయనే అనుమానాలు ఉన్నాయి.. గతంలో ల‌ద్దాక్‌, లేహ్‌లో ఇలాంటే వరదలే వచ్చాయి.. ఉత్తరాఖండ్ లో అలాగే చేశారు”.. ఇదీ ఆదివారం భ‌ద్రాచ‌లం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి… దాని వెన‌క నిజానిజాలు ప‌క్క‌న పెడితే, అస‌లు క్లౌడ్ బ‌ర‌స్ట్ అంటే ఏమిటి.. అవి ఎలా సంభ‌విస్తాయి అనే దానిపై చ‌ర్చ సాగుతోంది.. ఆకస్మిక వరదలు స్పష్టించవచ్చా? ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి కుండపోతగా వర్షాలు కురిపించవచ్చా? అనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారు..?

క్లౌడ్ బ‌ర‌స్ట్.. మేఘ విస్ఫోట‌నం ఈ మ‌ధ్య కాలంలో ఈ ప‌దం త‌ర‌చుగా వినిపిస్తోంది. చిన్న ప్రదేశంలో ఒక గంటలో 10 సెంటిమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. అయితే కుంభవృష్టిగా గంటలో 10 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిన ప్రతిసారీ దాని క్లౌడ్ బరస్ట్ అయి ఉండదు. అది అక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రుతుప‌వ‌నాలు దక్షిణ ప్రాంతంలోని అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. అటు పశ్చిమ మధ్యధరా తీరం నుంచి వీచే గాలులు ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి తేమను తీసుకుని వస్తాయి. ఈ రెండూ ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఇవే క్లౌడ్ బరస్ట్ కు కారణమవుతాయి. పర్వతాలపై ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. నదులు, సరస్సులు ఉన్న ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగితే అపార నష్టం జ‌రుగుతుంది. మన దేశంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఉత్తరాఖండ్,జ‌మ్మూకాశ్మీర్,హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లోనే ఇలాంటి ఘటనలుు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరుగుతూ ఉంటుంది.

వారం రోజుల కింద‌ట అమ‌ర్‌నాథ్ యాత్ర సంద‌ర్భంగా పెద్ద ఎత్తున కురిసిన వ‌ర్షాల వ‌ల్ల ఆక‌స్మికంగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. ఈ వ‌ర‌ద‌ల్లో 16 మంది యాత్రికులు మ‌ర‌ణించారు. ల‌ద్దాక్‌, లేహ్‌లో సైతం ఇలా ఆక‌స్మికంగా వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. 2013లో ఉత్తరాఖండ్ లో ఇలానే ఆకస్మిక వరదలు వచ్చాయి. అపార ఆస్తినష్టం.. భారీగా ప్రాణానష్టం జరిగింది. ఈ క్లౌడ్‌బ‌ర‌స్ట్ టెక్నాల‌జీ చైనా ద‌గ్గ‌ర ఉంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌ సమయంలో ఒక్కరోజు ముందు.. అన్నీ గ్రౌండ్స్‌లో వాటర్ లీకేజీని పరిశీలించేందుకు చైనా కృత్రిమ వర్షాలను సృష్టించింది. 1970 నుంచి 2016 మధ్య జమ్ముకశ్మీర్, లెహ్‌, పెహల్గామ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు 30 క్లౌడ్‌ బరస్ట్‌లు సంభవించాయి. దీని కారణంగా సుమారుగా 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అన్నీ కాకున్నా వీటిల్లో కొన్నింటికి మాత్రం ఖ‌చ్చితంగా డ్రాగ‌న్ దేశం పాపం ఉంద‌నే వాద‌న‌లు ఉన్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like