తక్షణం రూ.5 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి
-బాధితులకు రూ. 10 వేలు, 20 కేజీల బియ్యం ఇవ్వాలి
-మంచిర్యాల జిల్లా పట్ల వివక్ష ఎందుకు...?
-బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్
మంచిర్యాల: వర్షాలు,వరదల వల్ల నష్టపోయిన మంచిర్యాల జిల్లా ప్రజలకు తక్షణమే రూ.5 కోట్లు ప్యాకేజీ ప్రకటించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు, కొత్తగూడెం, వరంగల్ వెళ్ళి వరద ముంపు ప్రాంతాలను సందర్శించారని, మంచిర్యాల జిల్లాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు..? మంచిర్యాల జిల్లాపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత వివక్ష ఉందో అర్థం అవుతుందన్నారు. మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ ముఖ్యమంత్రిని జిల్లాకు తీసుకురావడంలో పూర్తి విఫలం అయ్యారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి వెంటనే మంచిర్యాల జిల్లా వరద ముంపు ప్రాంతాన్ని పర్యటించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా వరద బాధితులకు కూడా ఇతర జిల్లాలకు ప్రకటించినట్లుగానే ప్రతి కుటుంబానికి 10వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం, 20 కేజీల బియ్యం అందించాలన్నారు. మంచిర్యాల జిల్లాకు కూడా మూడు రోజుల్లో రూ.5కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, తుల ఆంజనేయులు, పెద్దపెల్లి పురుషోత్తం, రజినిష్ జైన్, కర్ణ శ్రీధర్, రేకాందర్ వాణి, జోగుల శ్రీదేవి, బోయిని హరికృష్ణ, గాజుల ప్రభాకర్, కుదురుపాక గంగన్న, బల్ల రమేష్, పచ్చ వెంకటేశ్వర్లు, ఆకుల సంతోష్, పచ్చ స్వప్న రాణి, తోట తిరుపతి, రాకేష్ రెన్వ, ప్రకాష్ శర్మ, బోయిని దేవేందర్, ముదారి శ్రీకాంత్, అరెందుల శ్రీనివాస్, కుచాడి సతీష్, తరుణ్, దయాకర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.