వారి కుటుంబాలకు అండగా ఉంటాం
-టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి
-బాధిత కుటుంబాలకు చెక్కులు అందచేత
వరదల్లో చిక్కుకున్న గర్భిణీని కాపాడే ప్రయత్నంలో అసువులు బాసిన సింగరేణి రెస్క్యూ సిబ్బంది మరణం దురదృష్టకరమని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. ప్రమాదంలో మరణించిన చీలిక సతీష్, అంబాల రాము కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి మరణం దురదృష్టకరమన్నారు. ఆ కుటుంబాలను పరామర్శించిన వారిలో శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి,ఏరియా చర్చల ప్రతినిధి కుమారస్వామి, RG-3 నాయకులు నాగేలి సాంబయ్య, శ్రీరాంపూర్ ఏరియా నాయకులు నీలం సదయ్య,పొగాకు రమేష్, అన్వేష్ రెడ్డి,పిట్ సెక్రెటరీ లు పెంట శ్రీనివాస్, సత్యనారాయణ, శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి అధికారులు దేవేందర్ రెడ్డి,రణదీప్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సంబంధిత చెక్కులు అందించారు.