భర్తకు కలెక్టర్ బాధ్యతలు అప్పగించిన భార్య
కేరళలోని అలెప్పీలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కలెక్టర్ రేణురాజ్ తన బాధ్యతలను భర్త శ్రీరామ్ వెంకట్రమన్ కు అప్పగించారు. అదేంటి అనుకుంటున్నారా? ఇటీవలే ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె స్థానంలో శ్రీరామ్ ను నియమించింది.ఆయన అక్కడికి వచ్చిన కొత్త కలెక్టర్. రేణు, శ్రీరామ్ భార్యాభర్తలు. వృత్తిరీత్యా వైద్యులైన వారు తర్వాత IAS లుగా మారి, ఈఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు.