వారిని విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
బెల్లంపల్లి పట్టణంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా విధులకు గైర్హాజైన సిబ్బందికి మెమోలు జారీ చేయడం ఏ మేరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కంకటి.శ్రీనివాస్ గారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలకు హాజరుకాకుంటే మెమోలు జారీ చేస్తారా..? అని ప్రశ్నించారు. ఆ రోజు రాకపోతే మున్సిపల్ కమిషనర్ మెమోలు జారీ చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నలుగురు కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.