రోడ్డు ప్రమాదం : లారీలుదగ్ధం
రెండు లారీలు నాలు ఢీకొనడంతో మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుఫ్టి ఘాట్ వద్ద రెండు లారీలు ఢీ కొట్టాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రెండు లారీ లు దగ్ధమయ్యాయి. ఆదిలాబాద్ వైపు నుండి నిర్మల్ వైపు వస్తుండగా ముందు వెళ్తున్న లారీ ని మరో లారీ ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. ప్రమాద సమయంలో డ్రైవర్ లు వాహనంలో లేరని చెపుతున్న పోలీసులు. దీంతో ప్రాణనష్టం తప్పింది.