‘రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350’ కొత్త బైక్ అదిరింది కదా…
Royal Enfield Hunter 350 : మార్కెట్లో ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ కంపెనీకి ఆదరణ రోజురోజుకి పెరుగుతోంది. అదే సమయంలో కంపెనీ కూడా వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త బైక్‌లను తీసుకు వస్తోంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రారంభంలో హిమాలయన్ స్క్రామ్ 411 విడుదల చేసింది. ఇప్పుడు మరో బైకు భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్దమైంది.
‘రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త బైక్‌ను హంటర్ 350 పేరుతో విడుదల చేయనుంది. ఇప్పటికే కంపెనీ దీనికి సంబంధించిన టీజర్లకు కూడా విడుదల చేసింది. ఫ్యూయెల్ ట్యాంక్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి చూడవచ్చు. ఇందులో ట్రిప్పర్ నావిగేషన్ అందినచనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త బైక్ భారతీయ మార్కెట్లో రేపు (ఆదివారం) విడుదల చేయనుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బేస్ వేరియంట్ ట్యూబ్-టైప్ టైర్లు స్పోక్ వీల్స్, సింగిల్-ఛానల్ ABS, రియర్ డ్రమ్ బ్రేక్ అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్‌లతో వస్తుంది. అఫిషియల్ వేరియంట్‌లకు LED టర్న్ ఇండికేటర్‌లు, అల్లాయ్ వీల్స్, డ్యూయల్-ఛానల్ ABS లభిస్తాయి. సిద్ లాల్ షేర్ చేసిన వీడియో టాప్-స్పెక్ మోడల్‌లో ఒకటి. LED టర్న్ ఇండికేటర్స్ కంపెనీ అధికారికంగా అందించే అవకాశం కూడా ఉంది. ఫీచర్స్ తో పాటు పెయింట్ స్కీమ్ కూడా భిన్నంగా ఉంటుంది.
ఇక ఇంజిన్ కూడా 349 cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూలింగ్‌తో లాంగ్-స్ట్రోక్ యూనిట్‌గా ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 20.2 bhpశక్తి, 27 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. కంపెనీ కొత్త బైక్ స్పెసిఫికేషన్‌ల ప్రకారం ఇంజిన్ ట్యూనింగ్‌ను సవరించవచ్చు. ఇంజిన్ అండ్ ఎగ్జాస్ట్ బ్లాక్ రంగులో అందించారు. ఇంజిన్ ఒకేలా ఉన్నప్పటికీ, ఎగ్జాస్ట్ సిస్టమ్ అంతా కొత్తది.