పర్యావరణహితంగా సేవా కార్యక్రమాలు చేయాలి
- వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్
-అప్పన్ కృష్ణమాచార్య ట్రస్ట్ ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్స్ పంపిణీ
ప్లాస్టిక్ ను నిషేధిస్తూ పర్యావరణ హితంగా ఉండేలా ఆలయాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ప్రతివాది భయంకర అప్పన్ కృష్ణమాచార్య ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బట్టలబజార్ లోని శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రసాదాల పంపిణీకి అవసరమైన క్లాత్ బ్యాగ్స్ ఉచితంగా అందచేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన బ్యాగ్స్ ను ట్రస్ట్ ప్రతినిధులు డా.సుధ, శ్రేయ, జ్యోతిర్మయి, డా.బొమ్మరవి, రంగనాథ్ లు ఎమ్మెల్యే ద్వారా ఆలయ ఈఓ రత్నాకర్ రెడ్డికి అందజేశారు. ప్లాస్టిక్ వాడకుండా క్లాత్, పేపర్ బ్యాగ్స్ వాడి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడ్తున్న సామాజిక సేవాకార్యక్రమాలను అభినందించారు. చేసే ప్రతీ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రజోపయోగంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పరాశరం శ్రీనివాసాచార్య, అర్చకులు శ్రీధరాచార్య, నితిన్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.