బాసర ట్రిపుల్ ఐటీకి గవర్నర్

తెలంగాణ గవర్నర్ తమిళ్ సై బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. రైలు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి బయల్దేరిన తమిళ్‌సై నిజామాబాద్ నుంచి బాసర వచ్చారు. ఉదయం నాలుగున్నర ప్రాంతంలో ఆమె బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. అక్కడ ఇన్ఛార్జి వీసి వెంకట రమణ, డైరెక్టర్ సతీష్ కుమార్ స్వాగతం పలికారు. కొద్దిసేపట్లో సరస్వతి అమ్మవారిని దర్శించుకోనున్న గవర్నర్ విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తారు. అనంతరం ట్రిపుల్ ఐటీ సమస్యలపై వారితో చర్చిస్తారు.