మంటలు చెలరేగి వాహనం దగ్ధం
ద్విచక్ర వాహనంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో వాహనం దగ్ధమైంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. కోటపల్లి మండల కేంద్రానికి చెందిన సంపత్ అనే వ్యక్తి సొంత పనుల నిమిత్తం చెన్నూరుకి వచ్చాడు. పాత బస్టాండ్ లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు తన HF డీలక్స్ వాహనం పక్కకు నిలిపాడు. కూరగాయలు కొని బండి స్టార్ట్ చేసే సమయంలో ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన సంపత్ పక్కకు పరుగులు తీశాడు. దీంతో ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ తోనే వాహనం కాలిపోయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పేశారు.