ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి వెల్లడించారు. సోమవారం సాయంత్రం చందా టి గ్రామ శివారు నందు గల శ్రీనివాస గార్డెన్ సమీపంలో పేకాట ఆడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు తమ బృందం దాడి చేయగా సంఘటనా స్థలంలో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాటరాయుళ్లను పట్టుకున్నట్లు వెల్లడించారు. వీరి వద్దనుండి పేకాట ముక్కలు, రూ. 22,260/- నగదు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. దర్యాప్తు నిమిత్తం ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడ్డ వారిలో రోలపు రాహుల్, సంధ్య సాయి, ఎర్రం సాయి, తోకల రూపేష్, పాండే ఆశిష్, సహారే వైభవ్ ఉన్నారని స్పష్టం చేశారు. వారిని ఆదిలాబాద్ రూరల్ పోలీస్ తరలించి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ దాడిలో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ గణపతి, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ ఇసాక్ ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.