బాసర ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
బాసర ట్రిపుల్ ఐటీలో సోమవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రిపుల్ ఐటీ అంధకారం నెలకొంది. సాంకేతికంగా సమస్య నెలకొనడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ వద్ద సమస్య తలెత్తిందని వారు స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి విద్యుత్‌కు ఆటంకం ఏర్పడింది. దీంతో సాంకేతిక సమస్యను అధికారులు సరిచేస్తున్నారు. విద్యార్థులు సెల్ఫోన్ లైట్ల వెలుతురులో చదువుకుంటున్నారు.