స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే
-పేదల నిర్మూలనతో పాటు దేశాభివృద్ధిలో కీలక భూమిక
-మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి
భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. ఆజాద్ కి గౌరవ్ పాదయాత్రలో భాగంగా జైపూర్ మండలంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అనేక ఉద్యమాల్లో పాల్గొని చివరకు లాఠీ దెబ్బలు సైతం తిని కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం సాధించిందని గుర్తు చేశారు. పేదల నిర్మూలనతో పాటు దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించిన పార్టీ కాంగ్రెస్ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.