అమరుల త్యాగాలను స్మరించుకోవాలి
దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అమరులను త్యాగాలను స్మరించుకోవాలని బెల్లంపల్లి పోస్ట్ మాస్టర్ పీ. సుధాకర్ గౌడ్ అన్నారు. ఆజాదిక అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా మాట్లాడారు. మనం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం మనకు గర్వ కారణమని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా జెండా ఎగరవేయాలని మన ప్రధాని నిర్ణయించారని తెలిపారు. ఇందులో భాగంగానే మన పోస్టల్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యం పంచుకొని జాతీయ జెండాల పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎస్పీ కేబిఆర్ ప్రసాద్ ఆదేశానుసారం బెల్లంపల్లి ఉప తపాలా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మెయిల్ ఓవర్ సీర్ తాజోద్దీన్, మదుకర్, క్లర్కులు సంతోష్, పోస్ట్ మెన్లు సంతోష్, రాజమల్లు, పోషమల్లు, బీపీఎం లు సత్యనారాయణ, నవీన్, శంకర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.