కరకట్ట నిర్మాణం.. బాధితులకు సాయం..
ముఖ్యమంత్రి కి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే దివాకర్ రావు

మంచిర్యాల లో గోదావరికి కరకట్ట నిర్మాణం చేపట్టాలని, వరదల్లో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ని కోరారు. బుధవారం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ని కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విజ్ఞాపన పత్రం అందించారు. కరకట్ట నిర్మాణం చేపడితే మంచిర్యాల కు భవిష్యత్ లో ముంపు సమస్య ఉండదని చెప్పారు. అదేవిధంగా వరద బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి తాను చెప్పిన విషయాలకు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు స్పష్టం చేశారు.