సుమనన్న.. గుండె నిండా..
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కు నారుతో రైతు కృతజ్ఞత
చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్యెల్యే బాల్క సుమన్ కి ఒక రైతు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపాడు. చెన్నూర్ మండలం సుబ్బరాంపల్లి గ్రామ యువ రైతు సంతోష్ తన పొలంలో బాల్క సుమన్ పేరుతో నారు వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా రైతు సంతోష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు.1658 కోట్ల నిధులతో చెన్నూర్ నియోజకవర్గం లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ పదికాలాలు పచ్చగా ఉండాలని ప్రజల తరఫున కోరుకుంటున్నట్లు తెలిపారు.