కన్నీరు పెట్టుకున్న జడ్పీ చైర్‌పర్సన్
మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి శుక్రవారం కంటతడి పెట్టుకున్నారు. కొందరు నేతలకు రాఖీ కడుతూ ఉద్వేగానికి గురైన ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. రాఖీ పండగ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు రాఖీ కట్టించుకునేందుకు మందమర్రిలోని ఆమె ఇంటికి వచ్చారు. వారందరికీ రాఖీ కట్టిన ఆమె మరోసారి ఉద్వేగానికి గురయ్యారు. నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీఆర్ఎస్ నేతలు ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. దీంతో పార్టీలు మారినా బంధాలు మారవంటూ ఆమె వారికి సూచించారు. సొంత అన్నదమ్ముల్లా ఉన్న వారంతా పార్టీతో దూరం అయ్యారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.