తుపాకీతో కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని ఫైర్ చేశారు. SLR వెపన్ తో గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి ఎలా కాల్పులు జరుపుతారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మంత్రి ఫైర్ చేస్తున్నా అధికారులు అడ్డుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. మిస్ ఫైర్ అయితే సామాన్యుల ప్రాణాలు పోయేవంటున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వివరణ కోరినట్లు తెలుస్తోంది. మంత్రి కాల్పులు ఎలా జరుపుతారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.