అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఆకస్మిక తనిఖీలు
తెలంగాణ, మహారాష్ట్ర అంతరాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్సై వెంకట్ సిబ్బంది తో ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర సిర్వంచ నుంచి తెలంగాణ వైపు కోటపల్లి వద్ద అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ మీదుగా రాకపోకలను సాగిస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. అదే సమయంలో చెన్నూర్ ప్రాంతం నుండి వస్తున్న RTC బస్ లను, వాహనాలను సైతం నిలిపి బ్యాగ్, లగేజ్ లను తనిఖీ చేసి అనుమానితులను ప్రశ్నించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు. ఈ సందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మావోయిస్టులు అసాంఘిక కార్యకలపాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.