ఆర్టీసి డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
తనను అకారణంగా సస్పెండ్ చేశారనే కారణంతో ఆర్టీసీ డ్రైవర ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే…. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని బస్ డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ నిరంజన్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అధికారులు సస్పెండ్ చెయ్యడం తో మనస్థాపానికి గురైన ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఈ క్రమంలో డిపో సెక్యూరిటీ సిబ్బంది, తోటి కార్మికులు ఆయనను అడ్డుకొని నీళ్ళు పోశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. అతన్ని వెంటనే రిమ్స్ ఆసుపత్రి కి తరలించారు.. అకారణంగా తనను సస్పెండ్ చేయడం వల్లనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు డ్రైవర్ వెల్లడించారు.