ఎంసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
Telangana Emcet Counseling: తెలంగాణ ఎంసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఆగస్టు 21 నుంచి ఫస్ట్ ఫేస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) షెడ్యూల్ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో (tseamcet.nic.in)లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. MPC స్ట్రీమ్ విద్యార్థులు TS EAMCET అధికారిక సైట్ నుండి కౌన్సెలింగ్ షెడ్యూల్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మొదటి దశ ప్రక్రియ ఆగస్ట్ 21న ప్రారంభమవుతుంది… ఆగస్టు 29వ తేదీన ముగుస్తుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్ట్ 23 నుండి ఆగస్ట్ 30 వరకు కొనసాగుతుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఆప్షన్లు ఇచ్చేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఆప్షన్ ఫ్రీజింగ్ తేదీ సెప్టెంబర్ 2న జరుగుతుంది. సెప్టెంబర్ 6న టెంపరరీ సీట్ల కేటాయింపు చేస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చు.
రెండో దశ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. చివరి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 21, 2022 వరకు చేపడుతారు. స్పాట్ అడ్మిషన్లు అక్టోబర్ 20వ తేదీ నుంచి నిర్వహించనున్నారు.