అటవీ శాఖ కార్యాలయంలో చోరీ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అటవీ కార్యాయలంలో దొంగలు పడ్డారు. కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ను ఎత్తుకెళ్లారు. కార్యాలయం తీసేందుకు వచ్చిన సిబ్బంది తాళం పగలగొట్ట ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళం కప్ప కార్యాలయంలో ఆవరణలోనే పడేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.