బాసర ట్రిపుల్ ఐటీ లో గంజాయి కలకలం
ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదు
బాసర ట్రీపుల్ ఐటీలో గంజాయి దొరకడం కలకలం సృష్టించింది. రెండు రోజుల కిందట వర్సిటీలోని హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. దీంతో పోలీసులు ఆ విద్యార్థులను పోలీస్ స్టేషన్ తరలించి విచారించారు. వారి వద్ద నుంచి 35 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు విద్యార్థులు E2 హాస్టల్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ గంజాయి మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం. గంజాయి వినియోగించిన ఇద్దరు విద్యార్థులను బాసర పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ముథోల్ సీఐ వినోద్ కుమార్ తెలిపారు. అయితే విద్యార్థులు మేజర్లా..? మైనర్లా..? అనే విషయం తెలియరాలేదు.