తప్పించుకున్న మావోయిస్టుల కోసం జల్లెడ
-ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ బూట్ల చప్పుడు
-ముమ్మరంగా కొనసాగుతున్న వేట

ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు. మూడు జిల్లాలో అణువణువూ గాలిస్తున్నారు. తాడ్వాయి, ఏటూరు నాగారం, కొత్తగూడ, గంగారం, బయ్యారం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు అడవుల్లో ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. వారి కోసం ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అడవులను జల్లెడ పడుతున్నారు. గూడూరు సర్కిల్‌లోని మట్టెవాడ, దుబ్బగూడెం, కామారం, గంగారం అటవి ప్రాంతాల్లో విస్తృతంగా కూబింగ్ నిర్వహిస్తున్నారు. తాడ్వాయి అడవుల్లోను బలగాల కూంబింగ్ సాగుతోంది.