కార్మికుడి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

-తుపాకీ, సెల్ ఫోన్లు,9 బుల్లెట్లు స్వాధీనం
-మరో ముగ్గురు పరారీ
-పెద్దపల్లి డీసీపీ రూపేష్

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 19న సింగరేణి కార్మికుడు కొరుకొప్పుల. రాజేందర్ హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక తుపాకీ, 9 బుల్లెట్లు, మూడు సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చెన్నూరు రూపేష్ హత్య వివరాలను వెల్లడించారు.

గోదావరిఖని గంగానగర్ కు చెందిన సింగరేణి కార్మికుడు కోరుకొప్పుల రాజేందర్ భార్య రవళితో ఆమె సొంత ఊరు కిష్టంపేటకు చెందిన చిన్ననాటి మిత్రుడు బంధం రాజుతో వివాహేతర సంబంధం ఉండేది. రాజేందర్ తో వివాహం జరగ్గా ఆరేళ్ల కాపురంలో ఇద్దరు కుమారుల సంతానం అయ్యారు. అయినా చిన్ననాటి మిత్రుడు బంధం రాజు తో రవళి అలాగే వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ క్రమంలోనే అడ్డుగా ఉన్న భర్త రాజేందర్ ను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్రయత్నం చేసింది. రెండుసార్లు ప్రయత్నం చేసినా విఫలం అయింది.

చివరకు ఈనెల 19న అర్ధరాత్రి దాటిన తర్వాత తన ప్రియుడు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన బంధం రాజుతో పాటు అతని మిత్రుడు సయ్యద్ ఇంట్లో నిద్రిస్తున్న రాజేందర్ పై తుపాకితో రెండు రౌండ్లు కణతిపై కాల్చి దారుణంగా చంపేశారు. మృతుని తండ్రి మొండయ్య ఫిర్యాదు మేరకు ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు చేశారు. మృతుని భార్య రవళి తో పాటు ఆమె ప్రియుడు రాజు, సయ్యద్ లను ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ పంపించారు. వీరితో పాటు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు డీసీపీ రూపేష్ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like